ఎన్టీఆర్, చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తూ వుండడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ కాంబినేషన్‌లో సినిమా సెట్స్ మీదకి వెళ్లడానికి ఇంకా టైమ్ వుంది. ప్రస్తుతానికి హీరోల నుంచి అంగీకారం పొందిన రాజమౌళి ఇంతవరకు ఇద్దరికీ కథ చెప్పలేదట. అతని వద్ద ఒక ఐడియా మాత్రం వుందట. మల్టీస్టారర్ సినిమా అనేసరికి ఫాన్స్‌లో చాలా టెన్షన్ వుంటుంది. తమ హీరోని ఎక్కడ తక్కువ చేస్తారోననే ఇన్‌సెక్యూరిటీ వుంటుంది. ఈ కారణంగానే తెలుగు సినిమాలో నిజమైన మల్టీస్టారర్లు అంతరించిపోయాయి. ఇవన్నీ రాజమౌళికి బాగా తెలుసు.
ఇద్దరూ విపరీతమైన ఫాలోయింగ్ వున్న హీరోలు కావడంతో ఒకరిని పిసరంత ఎక్కువ చూపించినా ఫాన్స్ డిజప్పాయింట్ అవుతారని రాజమౌళికి ఎరుకే. అందుకే ఈ కథనం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఇద్దరు హీరోలకి సమానమైన స్క్రీన్ టైమ్‌తో పాటు ఇద్దరికీ సరిసమానంగా పాటలు, ఇద్దరికీ సమానంగా ఎలివేషన్ సీన్లు ప్లాన్ చేస్తున్నాడట. ఏ హీరో అభిమాని కూడా కించిత్ నిరాశకి గురి కాకుండా రాజమౌళి ఈ కథనంపై కసరత్తు చేస్తున్నాడని సమాచారం.
లైన్ రెడీ అయినా కానీ సినిమాని మొదలు పెట్టడానికి సంవత్సరం టైమ్ తీసుకుంటోన్నది అందుకేనని తెలిసింది. ఈ చిత్రానికి తొమ్మిది నెలల్లోగా పూర్తి చేసి విడుదల చేయాలని కూడా రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. 2018 అక్టోబర్‌లో మొదలయ్యే ఈ చిత్రం 2020 సంక్రాంతికి వచ్చేస్తుందని అంటున్నారు.


No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.