శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (CSIR) టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం సరికొత్త ఆయుర్వేదిక్ యాంటీ డయాబెటిక్ ఔషదం ‘బీజీఆర్-34’ ను ఐదు రూపాయలకే అందిస్తోంది. లక్నోలోని ఎన్ బీఆర్ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధిచేశాయి. కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు వంటి వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ ఔషధాన్ని రూపొందించారు. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి శరీరంపై ఇతర ఔషదాల దుష్ప్రభావాలను తగ్గిస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు. రూ.5లకే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ సన్నద్ధమవుతోంది. ఈ మందు అందుబాటులోకి వస్తే మధుమేహం ఉన్నవారికి గొప్ప వరంగానే చెప్పుకోవాలి. అందరికీ తెలిసేలా షేర్ చేయండి
Search This Blog
Friday, November 24, 2017
Give good news to Sugar Disease patients and tell everyone about Rs.5
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.