Breaking

TELEGRAM CHANNEL

TELEGRAM CHANNEL
TELEGRAM CHANNEL

Search This Blog

Saturday, December 02, 2017

Anapama romance with Megahero


మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ పలు తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అందం, అభినయం కలగలిపిన నటి కావడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. రీసెంట్‌గా కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. కానీ తన పాత్రతో సంతృప్తి చెందకపోవడంతో వదిలేసుకుంది.

అయితే ఇప్పుడు మెగాహీరో సాయి ధరం తేజ్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోతుందని సమాచారం. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా చాలా రోజుల క్రితం ఓ సినిమా మొదలైంది. అయితే ఇప్పటివరకు సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరి నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను సంప్రదించగా ఆమెకు కథ నచ్చడంతో అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.


నిజానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావించాడు కరుణాకరన్. కొందరిపై ఫోటోషూట్స్ కూడా నిర్వహించారు. కానీ ఫైనల్‌గా అనుపమనే తీసుకున్నారు. ప్రేమ కథలతో యూత్‌ను ఫిదా చేసే కరుణాకరన్ ఈసారి కూడా లవ్ స్టోరీనే సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా ప్రేమకథల్లో ఓ కొత్త ఒరవడి సృష్టిస్తుందని బలంగా నమ్ముతున్నాడు.




No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.