Google తీసుకున్న ఈ డెసిషన్ చూసి మెచ్చుకోకుండా ఉండలేరు!
Android కన్నా iOSలో సెక్యూరిటీ బాగుంటుందని చాలామంది Apple అభిమానులు ఎగతాళి చేస్తుంటారు. వాస్తవానికి OS పరంగా Android ఏమాత్రం తీసిపోలేదు, Androidకి వస్తున్న సమస్యల్లా థర్డ్-పార్టీ డెవలపర్లు తయారు చేస్తున్న apps సరైన సెక్యూరిటీని అనుసరించకపోవడం వల్లనే!
ఒక app మన phoneలోకి వచ్చిన తర్వాత అది అవసరం ఉన్నా లేకపోయినా phone storage, location, contacts, photos వంటి అన్ని రకాల పర్మిషన్లనూ తీసుకోవడం గమనిస్తూనే ఉన్నాం. ఆ డేటాని అవి ఎలా వాడుకుంటున్నాయో కూడా మనకు అవి చెప్పవు.
అయితే ఈ పరిస్థితి మారబోతోంది. ప్రతీ పర్మిషన్ తీసుకోబోయే ముందు ఆ డేటాని ఎలా వాడుకోబోతున్నామో ఆయా apps యూజర్లకి ప్రత్యేకంగా ఓ మెసేజ్ రూపంలో చెప్పాలి. ఉదా.కి.. Ola, Uber వంటివే ఉంటే వాటికి location, contacts పర్మిషన్ సరిపోతుంది. అలా కాకుండా storage పర్మిషన్ అవి తీసుకుంటుంటే.. ఏ కారణం చేత ఆ పర్మిషన్ అడుగుతున్నదీ, ఆ storage డేటాని ఎలా వినియోగించబోతున్నదీ స్పష్టంగా యూజర్లకి చెప్పాలి.
యూజర్లకి వెల్లడించిన దానికి భిన్నంగా డేటాని దుర్వినియోగం చేస్తే ఆ apps మీద Google కఠినమైన చర్యలు తీసుకుంటుంది. రాబోయే 60 రోజుల లోపల app డెవలపర్లు తాము తీసుకునే పర్మిషన్లని యూజర్లకి పారదర్శకంగా చెప్పేలా మార్పులు చేయాల్సి ఉంటుంది.
SOURCE
SOURCE


No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.