Breaking

TELEGRAM CHANNEL

TELEGRAM CHANNEL
TELEGRAM CHANNEL

Search This Blog

Sunday, November 17, 2019

Fans before release .. "Wow ... Ala Vaikunthapuramulo see ?


Allu Arjun, who has been hit or miss for the past few years, is revealing his speed. Tollywood is ready to prove his stamina once again on screen. To this extent, Trivikram directed the film 'Ala .. Vaikunthapuramulo'. Allu Arjun Fans have been watching the movie set records for a while before its release.

Allu Arjun, Trivikram Combination is a hat trick movie. Bunny, who specializes in the film, is on the other side of the promotional program while shooting for Trivikram. All the updates already released from the movie have filled Josh in the category of mega favorites.

It is in this context that the cinema for the film's pre-release business is in good shape. Tribe of Trade Unions Competing for Rights Latest Celebration of the Year, a fancy offer for digital and satellite hacks of the film These hacks have been sold for 19.50 crores. Khushi says that the bunny celebration has begun before its release.

Geetha Arts Banner, Haruka & Hasini Creations is making a joint offering 'Ala .. Vaikunthapuramilu' Movie. Pooja Hegde plays the heroine opposite Allu Arjun. Sushant, Nivedita Peturaj and Tabu are playing key roles. The music provided by Thaman is going to be a plus for the film. The film is slated to release on January 12 amidst heavy expectations.


విడుదలకు ముందే ప్రభంజనం.. ఫ్యాన్సీ రేటుకు 'అల‌...వైకుంఠ‌పుర‌ములో..' హక్కులు B

గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న అల్లు అర్జున్.. తన స్పీడ్ బయట పెడుతున్నాడు. టాలీవుడ్ తెరపై మరోసారి తన స్టామినా నిరూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు శ్రీకారం చుట్టారు బన్నీ. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పడం చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అల వైకుఠపురములో' సినిమా. ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బన్నీ, త్రివిక్రమ్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ మెగా అభిమాన వర్గాల్లో జోష్ నింపాయి.

ఈ నేప‌థ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. 'అల వైకుఠపురములో' రైట్స్ కోసం ట్రేడ్ వర్గాలు తెగ పోటీ పడ్డాయట. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హ‌క్కుల‌కు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌ దక్కిందట. 19.50 కోట్ల‌కు ఈ హ‌క్కులు అమ్ముడైన‌ట్లు తెలుప్తోంది. దీంతో విడుదలకు ముందే బన్నీ ప్రభంజనం మొదలైందని ఖుషీ అవుతున్నారు ఆయన అభిమానులు.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.






source:

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.